
డీమన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9 తో ఒక్కసారిగా దూసుకొచ్చిన కుర్రాడు. బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరితో కలిసి ఫుల్ పులిహోర కలిపాడు. ఐతే వీళ్ళ ఫ్రెండ్ షిప్ జర్నీ బిగ్ బాస్ తో ఎండ్ ఐపోతుంది అనుకున్నారు ఆడియన్స్ కానీ వీళ్ళ జర్నీ బిగ్ బాస్ బయట కూడా కంటిన్యూ అయ్యింది. ఎన్నో షోస్ లో కలిసి కనిపించారు. షాప్ ఓపెనింగ్స్ కూడా కలిసి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక కవర్ సాంగ్ కూడా కలిసే చేసారు. "బంగారం " అనే సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సాంగ్ ప్రోమో ని లాంచ్ చేసింది ఎవరో కాదు పెద్ద సెలబ్రిటీ శ్యామల దేవి గారు. ఆమె ఎవరో కాదు కృష్ణం రాజు గారి సతీమణి. ఆమె ఈ సాంగ్ ప్రోమోని లాంచ్ చేశారు. అది చూసిన ఆమె "సాంగ్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. చాలా నాచురల్ గా నటించారు. వెస్ట్ గోదావరి లో జరిగిన పిక్చరైజేషన్ అంతా బాగుంది. ఆ పెంకుటిల్లు అన్నీ కూడా బాగున్నాయి. నువ్వు చాలా బాగా జీవిస్తున్నావ్ రోల్ లో. సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి హీరో కావాలి " అని ఆశీర్వదించారు.
ఇక డీమన్ పవన్ "థాంక్ యు సో మచ్ అమ్మ మా సాంగ్ ప్రోమో లాంఛ్ చేసినందుకు. మీ అందరికీ థాంక్స్ ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో వచ్చేసింది ఫుల్ సాంగ్ ఆగష్టు 6 న మీ అందరి ముందుకు రాబోతోంది. " అంటూ పవన్ ఒక నోట్ పెట్టాడు. ఇక నెటిజన్స్ కూడా ఈ సాంగ్ మీద రియాక్ట్ అవుతున్నారు. సీరియల్ నటుడు భరణి కూడా కామెంట్ చేసాడు. "కంగ్రాట్యులేషన్స్ డీమన్. గాడ్ బ్లేస్ యు " అన్నారు. "రివాన్ కి శుభాకాంక్షలు . ఈ సాంగ్ బిగ్ హిట్ అవ్వాలి. స్క్రీన్ మీద మీ ఇద్దరూ చాలా బాగున్నారు. మాజికల్ పెయిర్. ఇది ఒక మూవీ సాంగ్ లా ఉంది. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.